జి.పుల్లయ్య ఎంబీఏ విద్యార్థుల జయకేతనం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక వెంకయపల్లిలోని జీ.పులయ్య ఇంజనీరింగ్ కళాశాల ఎంబీఏ విద్యార్థులు,శ్రీ రామకృష్ణ పి.జి కాలేజ్ నంద్యాలలో నిర్వహించిన 25వ నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్ 2024 లో జి.పుల్లయ్య కాలేజీ విద్యార్థులు పోటీలలోని ఆరు విభాగాలలో నాలుగు విభాగాలలో బహుమతులు గెలుపొంది విజయకేతనాన్ని ఎగరవేశారు.ఫైనాన్స్ ఈవెంట్లో ఆనం మహిన్ మొదటి బహుమతి. బిజినెస్ క్విజ్ లో అలేఖ్య, భవజ్ఞ, మనోనందిత రెండో బహుమతి. మార్కెటింగ్ హెచ్ఆర్ ఈవెంట్ లో కార్తీక్ హర్షవర్ధన్ రెండో బహుమతి. పేపర్ ప్రజెంటేషన్ లో రాఘవేంద్ర మురళీకృష్ణ రెండో బహుమతి గెలుపొందారు. ఇందులో భాగంగా కాలేజ్ యాజమాన్యం వారు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో డా||సి.శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఎంబీఏ విద్యార్థులు ఇలా బహుమతులు పొందడం ఇది రెండవ సారి అని ఈ ఘనతను ఇలాగే కొనసాగించాలని, ఈ పోటీలలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు తమ వ్యక్తిత్వ వికాసం తో పాటు ప్రపంచంలో పోటీ తత్వం తెలుసుకోవడానికి ఎంతో దోహదపడుతుందని విద్యార్థులకు సూచన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంబీఏ విబాగాధిపతి డా||ఎం.గిరిధర్ కుమార్ పాల్గొని విద్యార్థులను అభినందించారు.