పట్టిసంలో ఫిబ్రవరి 25 నుండి 27వరకు మహాశివరాత్రి ఉత్సవాలు
1 min readఈనెల 6వ తేదీన ఉత్సవ కమిటీ రెండవ సమావేశం
ఉత్సవ కమిటీ చైర్మన్, జంగారెడ్డిగూడెం ఆర్డిఓ ఎం.వి. రమణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: మహాశివరాత్రి సందర్బంగా పట్టిసం శ్రీవీరేశ్వరస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు విస్త్రృత సౌకర్యాలు కల్పించే విషయంపై ఈనెల 6వ తేదీ గురువారం ఉదయం 10.00 గంటలకు పట్టిసం శ్రీవీరేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో మహాశివరాత్రి ఉత్సవ కమిటీ రెండవ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్, జంగారెడ్డిగూడెం ఆర్డిఓ ఎం.వి. రమణ తెలిపారు. మహాశివరాత్రి సందర్బంగా ఫిబ్రవరి 25వ తేదీ నుండి ఫిబ్రవరి 27 వరకు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించడం జరుగుతుందన్నారు. ఈ దృష్ట్యా సంబంధిత అధికారులందరూ సదరు సమావేశానికి హాజరు కావాలని ఆమె కోరారు.