జ్ఞానమే అమృతం- దానికోసం నిరంతరం శోధించాలి
1 min readశ్రీశ్రీశ్రీ కమాలానంద భారతి స్వామీజీ విద్యార్థులకు అనుగ్రహ భాషణం
ఇండస్ -మాంటిస్సోరి విద్యాసంస్థలలో గుభాళించిన సంస్కృతీ పరిమళం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విద్య అంటే కేవలం ఉపాధి కోసమే కాకుండా, సమాజహితానికి ఉపయోగపడే జ్ఞాన సముపార్జన చేయాలని గన్నవరం భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ విద్యార్థులకు అనుగ్రహ భాషణం చేశారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇండస్ – మాంటిస్సోరి పాఠశాలల క్రీడా ప్రాంగణంలో దాదాపు మూడు వేల మంది విద్యార్థులతో సామూహిక నమస్కారములు అత్యంత శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా పూజ్య స్వామీజీ విద్యార్థులకు అవసరమైన అనేక విషయాలను ఉటంకించారు. ఈ కార్యక్రమంలో మాంటిస్సోరి -ఇండస్ పాఠశాలల కరెస్పాండెంట్ కె.ఎన్.వి. రాజశేఖర్, మాంటే – మైన్స్ ఇంటర్నేషనల్ పాఠశాలల కరెస్పాండెంట్ డాక్టర్ కె.ఎన్.వి. గాయిని రాజశేఖర్, ఇండస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మీనాక్షి విల్సన్, ఇండస్ కార్య నిర్వాహక అధ్యక్షులు విల్సన్ అగస్టిన్, ప్రధానోపాద్యాయిని కిరణ్మయి, సి.బి.ఎస్.సి. ప్రిన్సిపాల్ శ్రీనివాసులు రెడ్డి, యోగా మాష్టర్ పి. శ్రీనివాసులు, గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్త, పాలాది సుబ్రహ్మణ్యం, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డితో పాటు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.