సంక్షేమ సారధి సీఎం జగన్ మోహన్ రెడ్డి కే పట్టం కట్టండి
1 min readవైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో 12వ వార్డు నందు వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక ,ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వై రుద్ర గౌడ్ ,బుట్టా శివ నీలకంఠ గ,వార్డు ఇంచార్జ్ షాబుద్ధిన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అశేష ప్రజాదరణతో ముఖ్యమంత్రి అయిన జగన్ ఇచ్చిన మాట మేరకు అనేక పథకాలు అమలు చేసి ప్రజా సంక్షేమానికి బాటలు వేశారని వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు కొనియాడారు.ఎమ్మిగనూరు పట్టణంలో 12వ వార్డు నందు శ్రీమతి బుట్టా రేణుక ,షాబుద్ధిన్ గారు ఎన్నికల ప్రచారం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ తెచ్చారని కొనియాడారు.జగన్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని,ఈ ఎన్నికల్లో ఆయనను ఆదరిస్తారని పేర్కొన్నారు.ఇంటింటా కార్యక్రమం ప్రచారంలో భాగంగా ప్రజలు అపూర్వ ఘన స్వాగతం పలికారు. మే 13న జరగనున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి బుట్టా రేణుక ని, ఎంపీ అభ్యర్థిగా బి వై రామయ్య గారిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.ఈ ప్రచారంలో రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చైర్మన్ బుట్టా శారద,రాష్ట్ర షాప్ నెట్కార్పొరేషన్ చైర్మన్ మాచని వెంకటేష్,జిల్లా మైనారిటీ వక్ఫ్ బోర్డ్ ఉపాధ్యక్షులు రియాజ్ అహమ్మద్,అధికార ప్రతినిధి సునీల్,కౌన్సిలర్లు ఇషాక్,వాహీద్,అమానుల్లా,సుధాకర్, కో-ఆప్షన్ మెంబర్లు అబ్రార్,గట్టు ఖాజా,ఇన్ఛార్జ్లు ప్రతాప్ రెడ్డి, వార్డు నాయకులు తెలుగు రాముడు,నరేష్,యం, వెంకటేష్,యల్లప్ప,వెంకటేశులు,ఓబులేషు, నరసింహులు,కుమార్,రజాక్,వడ్డే రంగన్న,టౌన్ బ్యాంక్ చైర్మన్ బి.ఎన్. నాగరాజ్, డిష్ రఫీ,మాధవ్ స్వామి,యు రమేష్, ఇంద్రసేనారెడ్డి,డీలర్ ఖాజా,ఖిబులా రహమతుల్లా, ఖిబులా హుస్సేన్,టి.కె గౌస్,ఫక్రుద్దీన్,జిల్లా ప్రచార కార్యదర్శి షేక్ చాంద్ బాషా,సలిమ్,గౌస్,హనీఫ్,కలాం,యూసుఫ్,కడివేళ్ళ ఉరుకుందు గౌడ్,మాచని రఘు,మాచని సోమేశ్,రఘువీరా,గురవయ్య, మహబూబ్,రాము,బాషా,పల్లవి రాజశేఖర్,పట్టణ కార్యదర్శి దొరబాబు,బుట్టా యూత్ నాయకులు ఫయాజ్, ఉబేద్,వైస్సార్సీపీ విద్యార్థి విభాగం జిలా కార్యదర్శి సోమేశ్,నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.