క్యాన్సర్ పై అవగాహన…
1 min readక్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తించి సరైన చికిత్సను అందించగలం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క్యాన్సర్ పై అవగాహన పెంపొందించుకోవడం ముందస్తు పరీక్షలు చేయించుకోవడం వల్ల క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తించి సరైన చికిత్సను అందించగలమని సర్జికల్ గ్యాస్ట్రో ఆంకాలజీ వైద్య నిపుణులు డాక్టర్ ఎస్. జె జానకి రామ్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కిమ్స్ వైద్యశాల, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ , సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో బాల సాయి కంటి ఆసుపత్రి ఆవరణలో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గుండె వైద్య నిపుణురాలు డాక్టర్ కే. అరుణ మాట్లాడుతూ క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ,వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, కలుషిత ఆహారానికి దూరంగా ఉండడం ,ధూమపానం, మద్యపానం ,గుట్కా, మారకద్రవ్యాలకు దూరంగా ఉండడం అనేది మన ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రెటరీ లయన్స్ అడిషనల్ మాజీ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలి ని అలవర్చుకోవడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ,ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతామన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కిమ్స్ డి.జిఎం కే .ఆనంద్ ,మార్కెటింగ్ మోతీ భాష ,కంటి వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాశ్, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నాగరాజు ,విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు మురళి శంకరప్ప, డాక్టర్ రంగనాయకులు, డాక్టర్ ప్రభాకర్,నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.