కేంద్ర బడ్జెట్ ప్రతులను దహనం చేసిన రైతు-కార్మిక సంఘాలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతాంగానికి, కార్మికుల కు ఏమాత్రం ప్రయోజనం లేదని, కార్పొరేట్ వర్గాలకు మేలుచేసే విదంగా ఉందని, నిరసిస్తూ బుధవారం కర్నూలు జిల్లా పత్తికొండలో వామపక్ష రైతు సంఘాలు – కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో స్థానిక నాలుగు స్తంభాలు దగ్గర ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు.అంతకు ముందు స్థానిక అంబెడ్కర్ సర్కిల్ నుంచి నాలుగు స్తంభాలు వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘము నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బి. సురేంద్ర కుమార్, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి కృష్ణయ్య, సీఐటీయూ నియోజకవర్గ కార్యదర్శి దస్తగిరి, సీపీఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి లు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతాంగానికి, కార్మిక వర్గానికి ఏమాత్రం ప్రయోజనం లేదని అన్నారు. కార్పొరేట్ వర్గాలకు మేలు చేసే విదంగా ఉందని ఇది చాలా దుర్మార్గపు చర్య అని వారు అన్నారు. కార్పొరేట్ అనుకూల విధానాలతో రైతులు, కార్మికులు కడుపు కొట్టే చర్యలు చేపట్టిందన్నారు.దేశానికి అన్నం పెట్టే రైతన్న కు తాను పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టం కోసం ఏమాత్రం చర్చించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ బడ్జెట్ రైతులను, కార్మికులను పూర్తిగా నిరాశ పరిచిందని విమర్శించారు.పేద వర్గాలకు, అసంఘటిత రంగానికి ఏమాత్రమూ ప్రయోజనం చేకూరలేదని వాపోయారు.కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక విధానాలను నిరసిస్తూ భవిష్యత్ లో పెద్ద ఎత్తున ఐక్య ఉద్యమలు కు సన్నద్ధం కావాలి వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షుడు నెట్టేకంటెయ్య, అంగన్వాడీ వర్కర్స్.