ఆదోనిలో..మార్పు మొదలైంది..
1 min readముస్లిం మైనార్టీలను కలిసిన కూటమి అభ్యర్థి డా. పార్థసారధి
- ఆదోని అభివృద్దికి కట్టుబడి ఉంటానని హామీ…
ఆదోని, పల్లెవెలుగు:పశ్చిమ ప్రాంతంలోనే ఆదోని అభివృద్ధిలో పూర్తిస్థాయిలో వెనుకబడి ఉందని, ఇక్కడ రోడ్లు, కాలువలు.. చివరకు తాగునీటి సమస్యతోనూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తనను గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని కూటమి అసెంబ్లీ అభ్యర్థి డా. పార్థసారధి హామీ ఇచ్చారు. బుధవారం పట్టణంలోని ముస్లిం మైనార్టీలను వారి ఇంటి వద్దకు వెళ్లి… తనను గెలిపిస్తే ఆదోని అభివృద్ధికి చేయాల్సిన పనుల గురించి వివరించారు. ముస్లింలు బీజేపీకి మద్దతు ఇవ్వరన్న దుష్ప్రచారాన్ని… ఈ సందర్భంగా డా. పార్థసారధి తిప్పికొట్టారు. ముస్లిం పెద్దలతో ఆదోని అభివృద్ధిపై క్షుణ్ణంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతోపాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనూ వర్తింపజేస్తామన్నారు. ఆదోని అభివృద్ధికి అన్నివర్గాల వారు కలిసికట్టుగా పని చేయాలని, లేదంటే భూకబ్జాదారులు, అవినీతిపరులే రాజ్యమేలుతారని ఆరోపించారు. ప్రచారంలో టీడీపీ నాయకులు మదిరె భాస్కర్, గుడిసె కృష్ణమ్మ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.