దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం కోసం అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ కృషి
1 min readఅందరిని ప్రేమించు,ఎవ్వరినీ ద్వేషించకు విశ్వ మానవతా సందేశం
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ప్రపంచ శాంతి స్థాపన కొరకై ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తూ ఏలూరులో పత్రికా విలేఖర్లను కలిసి కమ్యూనిటీ నూరుల్ ఇస్లాం శాఖ ప్రజాసంబంధాల అధికారి ముహమ్మద్ జావిద్ అహ్మద్ పాషా తన పర్యటన ఉద్ద్యేశ్యాన్ని వివరిస్తూ ప్రపంచం నేడు చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నదని, ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించడం తమ కర్తవ్యంగా భావించి, క్రమం తప్పకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతి సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించడానికి శాంతి సమ్మేళణాలు, సెమినార్లు, చర్చాగోష్టి మరియు విద్యావేత్తల, మేధావుల సలహాలు తీసుకొని ప్రపంచ శాంతి స్థాపనకై అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, సర్వ ధర్మాల అవతార పురుషులను పరస్పరం గౌరవించుకున్నప్పుడే ప్రపంచంలో శాంతి స్థాపించవచ్చునని అన్నారు.జిల్లా ప్రెస్ మరియు మీడియా ప్రతినిధి మునవ్వర్ అహ్మద్ మస్తాన్ మాట్లాడుతూ అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీని హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ (అ.స) 1889వ సంత్సరం భారతదేశంలోని, పంజాబు రాష్ట్రం, ఖాదియాన్ నగరంలో స్థాపించి, ఇస్లాం వ్యవస్థాపకులు హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహివ సల్లం 1400వందల సంవత్సరాల క్రితం చేసిన భవిష్యవాణి ప్రకారం తానే వాగ్దాత్త మసీహ్ నని ప్రకటించారు. ఈ కమ్యూనిటీ నేడు విశ్వవ్యాప్తంగా శాంతి స్థాపన కొరకు 200 లకు పైగా దేశాల్లో వ్యాపించి ధార్మిక యుద్ధాలకు ముగింపు పలికి, రక్తపాతాన్ని ఆపి, సమానత్వం, న్యాయం మరియు మత సామరస్యంతో కూడిన నవ సమాజ నిర్మాణం, ప్రపంచ శాంతి కోసం కొరకు కమ్యూనిటీ ఐదవ ఖలీఫా (ఉత్తరాధికారి) హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ నేతృత్వంలో అందరిని ప్రేమించు ఎవ్వరినీ ద్వేశించకు అనే నినాదంతో హ్యూమానిటీ ఫస్ట్ శాఖ ఆధ్వర్యంలో మానవ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది.అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ ప్రస్తుత ఖలీఫా విశ్వవ్యాప్తంగా వివిధ దేశాల పార్లమెంట్లలో (అమెరికా, యూరప్, కెనడా, జర్మనీ, జపాన్ మరియు ఐక్యరాజ్య సమితి) మొదలగు వాటిలో ప్రసంగిస్తూ అధికారం ఉగ్రవాదం విద్వేశమనే గోడలను నిర్మించగలవే కానీ జన హృదయాలను గెల్చుకోలేవని అన్నారని తెల్పిరు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ జిల్లా ఇంచార్జ్ జాఫర్ ఖాన్ సాహెబ్ మరియు జిల్లా మీడియా ప్రతినిధి అహమ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రతినిధి మునవ్వర్ అహ్మద్ మస్తాన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మీడియా ప్రతినిధి జిల్లా కార్యవర్గ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.