PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా శ్రీశ్రీ శ్రీ దస్తగిరి స్వామి  ఉరుసు మహోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలి మండల పరిధిలోని చిన్న పూదెళ్ళ గ్రామంలో శ్రీ శ్రీశ్రీ దస్తగిరి స్వామి వారి ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించిన అనంతరం దస్తగిరి స్వామి కూడా ఒకేరోజు ఈ గ్రామంలో పూజలు నిర్వహించడం అనవాదిగా నిలిచింది. అందులో భాగంగా బుధవారం నుండి శుక్రవారం వరకు దస్తగిరి స్వామి పూజలలో భాగంగా బుధవారం గంధము, గురువారం ఉరుసు, శుక్రవారం జియారత్ కార్యక్రమంలో నిర్వహిస్తూ, స్వామికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.  ముఖ్యఅతిథిగా

పింజరి కమాలి  వారసులు

చికెన్ భాష వారి కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారి కి సేవలలో పాల్గొని ప్రజలందరికీ భక్తి మార్గాన నడిపిస్తూ ఉంటారు. అందులో భాగంగా గ్రామంలో ఎద్దుల బండలాగు పోటీలు మొదటి మొదటి బహుమతి 71 వేలు , రెండో బహుమతి 50,000 వేలు , మూడో బహుమతి 30,000, నాలుగో బహుమతి 20,000, ఐదో బహుమతి 10,000 , ఆరో బహుమతి 5000  వేల చొప్పున  బండలాగు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులుగా వారికి అందజేశారు. అనంతరం అక్కడ వచ్చిన వారందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఇలాగే చికెన్ బాష వారి కుటుంబ సభ్యులు దస్తగిరి స్వామికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ముక్కులు తీర్చుకుంటూ గ్రామం ప్రశాంతంగా వుండాలని ,పాడిపంటలు కొలువై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలుగా ఉండాలని కోరుకుంటూ ఈ దస్తగిరి స్వామి పూజ కార్యక్రమంలో నిర్వహించినట్లు చికెన్ భాష వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న పూదెళ్ళ గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author