NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హెల్మెట్.. వాహన పత్రాలను తప్పనిసరిగా వినియోగించాలి

1 min read

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నరేంద్ర

నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఏలూరులో హెల్మెట్, వాహనాలకు సరైన పత్రాలు లేని వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నరేంద్ర హెచ్చరించారు.  స్థానిక సి.ఆర్. రెడ్డి కళాశాల వద్ద మంగళవారం మోటారు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్మెట్, వారణాలకు సరైన పత్రాలు లేని 30 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి అపరాధరుసుము వసూలు చేసినట్లు చెప్పారు.  ప్రమాద సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రమముఖ్యతను వాహనదారులకు తెలియజేసారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రజ్ఞ, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author