భక్తిశ్రద్ధలతో మారెమ్మ, దేవమ్మ ల దేవర
1 min readభారిగా కుంభాలతో ఊరేగింపు
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: మండల పరిధిలోని సూగురు గ్రామంలో వెలసిన శ్రీ మారెమ్మ, దేవమ్మ ల దేవర వేడుకలు గ్రామ ప్రజల అధ్వర్యంలో బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీగా మహిళలు, యువతులు గ్రామ ప్రజలు కుంభాలతో గ్రామ పురవీధుల గుండా అమ్మవార్ల దేవాలయం కు చేరుకుని నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దేవాదాయాలను వివిధ రకాల విద్యుత్ దీపాలతో, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. దేవర పురస్కరించుకుని పలువురు నాయకులు అమ్మవార్ల ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంత్రాలయం సిఐ రామాంజులు ఆధ్వర్యంలో ఎస్ఐ శివాంజులు తమ పోలీసు సిబ్బంది తో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకరమ్మ, లక్ష్మయ్య, ఉప సర్పంచు గర్జి గోపినాథ్, ఎంపిటిసి సత్యమ్మ, గ్రామ పెద్దలు కొళ్లు భీమన్న, ఈరన్నాప్ప ఏజంద్రరెడ్డి, ఓంకార్ రెడ్డి, చంద్రప్ప, లక్ష్మి రెడ్డి, వీరారెడ్డి, గురుమూర్తి, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.