వలస కార్మికుల పిల్లలకు వన్ నేషన్ వన్ రేషన్ తరహా లో ఉచిత విద్య అందించండి
1 min readవిద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ని లేఖ ద్వారా కోరిన పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అడ్వకేట్ క్రాంతి నాయుడు.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: వలస కార్మికుల పిల్లలకు వారి పని ప్రదేశంలో విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్య శాఖ మంత్రి నారా లోకేష్ ని లేఖ ద్వారా లేఖ ద్వారా కోరారు. ఈ మేరకు బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు ప్రాంతంలో ఎక్కువ మంది వలస కార్మికులు ఉన్నారు, వారు ఇతర ప్రదేశాలకు వలస వెళ్ళేటప్పుడు వారి పిల్లలకు విద్య తో సహా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ ప్రకారం 6 నుండి14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరికీ విద్యా హక్కును అందించాలి అని హామీ ఇస్తుంది. అయితే, వలస వెళ్ళే పిల్లలు తరచుగా వారి కుటుంబంతో పాటుగా వలస వెళ్లడం వల్ల పాఠశాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం వారి ఊరితో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను పొందేలా చూసుకోవడం అత్యవసరం. ప్రభుత్వం సీజనల్ హాస్టల్ సౌకర్యాన్ని అందిస్తున్నప్పటికీ, అది లక్ష్యానికి అనుగుణంగా లేదు మరియు వలస వెళ్ళే కార్మికుల అవసరాలను తీర్చడం లేదు.ఒక దేశం, ఒకే రేషన్” సంచలనం మీకు తెలిసిందే అలానే, వలస వెళ్ళే కార్మికుల పిల్లలకు వారి పని ప్రదేశాలలో విద్యను అందించడానికి “ఒక దేశం, ఒక తరగతి గది” అనే భావనను మేము ప్రతిపాదిస్తున్నాము. దీనిని కేంద్రం ప్రవేశ పెట్టిన “ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడెమిక్ అకౌంట్ రిజిస్ట్రేషన్ (APAAR) వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడి” ద్వారా సాధించవచ్చు.