వలసల నివారణకై 13న పత్తికొండలో సదస్సు..
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: వలసలను నివారించాలని కోరుతూ ఈనెల 13న పత్తికొండలో వ్యవసాయ కార్మిక సంఘం తలపెట్టిన సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వీరశేఖర్ నారాయణ పిలుపునిచ్చారు. బుధవారం సిపిఎం ప్రాంతీయ కార్యాలయంలో మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో చేయడానికి పనులు లేక కూలీలు వలసలు వెళ్తున్నారని, ప్రభుత్వం వలస నివారణ చర్యలు చేపట్టాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని దినాలు, కనీసం 400 రూపాయలు వేతనం ఇవ్వాలని, అందరికీ పనులు కల్పించాలని కోరుతూ, ఫిబ్రవరి 13వ తేదీన పత్తికొండ మండల కేంద్రంలోని సాయి బాబా కళ్యాణ మండపంలో సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు, ఉపాధి హామీ పీడీ గారు హాజరవుతున్నారని, కావున వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని వారు కోరారు. పత్తికొండ రెవిన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో 6 వారాల పెండిగ్ వేతనాలు ఇవ్వాలని వారు ఈ సందర్భంగా కోరారు. అలాగే పనులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బాలకృష్ణ శ్రీరాములు మండల అధ్యక్ష కార్యదర్శులు దస్తగిరి పెద్దహుల్తి సురేంద్ర సీఐటీయూ జిల్లా నాయకులు వెంకటేష్ రెడ్డి రైతు సంఘం నాయకులు సిద్దయ్య గౌడ్ సంఘం నాయకులు నరసన్న బుజ్జులు, శికామణి తిరుపాల్ బ్రహ్మయ్య బజారి నరసింహులు రాముడు తదితరులు పాల్గొన్నారు.