NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ అచ్చమ్మ పేరంటలమ్మ తల్లి 68వ ఉత్సవాలు

1 min read

మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల నడుమ రసవత్తరమైన కార్యక్రమాలు

తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఘనంగా ఫిబ్రవరి 4వ తేదీ నుండి ప్రారంభమైన  శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి 68వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలను దెందులూరు శాసనసభ్యులు చింతన ప్రభాకర్ మంగళవారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయనకు కమిటీ సభ్యులు, గ్రామస్తులు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి పూలమాలలతో, దుశాలువాలతో  ఘనంగా సత్కరించి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూదెందులూరు మండలం గాలాయగూడెం గ్రామ దేవత శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి దెందులూరు నియోజకవర్గం గాలాయగూడెంలో వేంచేసిలో ఉండడం తన  పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు. దెందులూరు మండలం గాలాయగూడెంలోని శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయావరణలో అమ్మవారి ఉత్సవాలను  ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సంప్రదాయపద్ధంగా వేద పండితుల ఆశీర్వదాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు .అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన గ్రామస్తులకు, రాజకీయ ప్రముఖులకు, ఉద్యోగ వ్యాపారవేత్తలకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు కమిటీ సభ్యులు తెలిపారు.

About Author