శ్రీ పెద్దింటి అమ్మవారి ఆలయంలో హుండీల లెక్కింపు..
1 min readతనిఖీ అధికారి వి సుధాకర్ పర్యవేక్షణలో లెక్కింపు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : కైకలూరు మండలం, కొల్లేటికోట గ్రామం లో వేంచేసియున్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానం నందు నెలకొల్పబడిన హుండీ లను గురువారం ఉదయం గం.10.00 లకు వి. సుధాకర్ తనిఖీ ఆధికారి దేవాదాయ ధర్మదాయ శాఖ గుడివాడ వారి పర్యవేక్షణలో సదరు కార్యనిర్వహణాధికారి వారి సమక్షంలో తెరచి లెక్కించగా 55 రోజులకు గాను నగదు రూపంలో రూ.14,29,977/- లు, బంగారం 7 గ్రాముల 400 మిల్లి గ్రాములు, వెండి 440 గ్రాములు వచ్చినది అని ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి. గోపాల రావు ఒక ప్రకటనలో తెలియజేసియున్నారు. ఈ సందర్భంగా శ్రీ పెద్దింట్లమ్మ సేవా సమితి పందిరిపల్లిగూడెం వారు మరియు ఆలయ అర్చకులు, సిబ్బంది లెక్కింపులో పాల్గొనియున్నారు.