గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పిడిఎఫ్ అభ్యర్థిగా దిడ్ల వీర రాఘవులు నామినేషన్
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/9-6.jpg?fit=550%2C367&ssl=1)
ఏలూరులో ఉపాధ్యాయ, ఉద్యోగ,కార్మిక, ప్రజాసంఘాల భారీ ర్యాలీ
పిడిఎఫ్ అభ్యర్థి డి.వి.రాఘవులు విజయం ఖాయం
శాసనమండలి పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ కె.ఎస్.లక్ష్మణరావు
ప్రజల గొంతుకను గెలిపించండి
ఎమ్మెల్సీ ఇళ్ల.వెంకటేశ్వర్లు
ప్రజా సమస్యలపై ప్రశ్నించేది మేమే
ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్త
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లాప్రతినిధి: ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పి.డి.ఎఫ్) అభ్యర్థిగా దిడ్ల వీర రాఘవులు (డి.వి.రాఘవులు) నామినేషన్ కార్యక్రమం భారీ ర్యాలీతో అట్టహాసంగా జరిగింది.ఏలూరు,పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలు మరియు రంపచోడవరం రెవెన్యూ డివిజన్ నుండి వందలాది మందిఉద్యోగులు,ఉపాధ్యాయులు, పట్టభద్రులు, కార్మిక మరియు ప్రజాసంఘాల నుండి తరలివచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయం నుండి ఫైర్ స్టేషన్ మీదుగా జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ గురువారం నిర్వహించారు.ఏలూరు కలెక్టరేట్ లో అభ్యర్థి డివి రాఘవులు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం సీఐటీయూ కార్యాలయం వద్ద బహిరంగ సభ నిర్వహించారు.ఈ బహిరంగ సభకు యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి. సుభాషిని అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన శాసనమండలి పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్, కృష్ణా,గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే శక్తి పిడిఎఫ్ అభ్యర్థులకు మాత్రమే ఉందని చెప్పారు. స్వలాభం కోసం కాకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. డివి రాఘవులు గత 40 సంవత్సరాలుగా యుటిఎఫ్ లో వివిధ స్థాయిలలో పనిచేసి ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమాలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. డివి రాఘవులు విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి పాలకులు ప్రజల జీవితాలు ఫణంగా పెట్టి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన చట్టాలు చేస్తున్నారని విమర్శించారు. పాలకుల తప్పుడు విధానాలు ప్రశ్నించి ప్రజా సమస్యలను లేవనెత్తి పరిష్కారం కోసం కృషి చేసే డివి రాఘవులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పాలకులుపట్టించుకోవడంలేదని అన్నారు.శాసనసభలో ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సమస్యలపై అడిగేవారే లేరని ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్, సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు వి ఉమామహేశ్వరరావు, మంతెన సీతారాం, బి.బలరాం,కె.ఉమామహేశ్వరరావు పి చంద్రశేఖర్, ఎస్ బాలాజీ, జ్యోతి బసు, శ్రీదేవి, అరుణ కుమారి, రవికుమార్, ముస్తఫ్ఆలీ,విజయరామరాజు, రామభద్రం, జయకర్, షరీఫ్, నరేష్, డి ఎన్ వి డి ప్రసాద్, ఎ. రవి, ఎస్ ఎన్ రమేష్, జి రవి కిషోర్, బేబీ రాణి, జెఎన్వి గోపాలన్, అరుణ్ కుమార్,ఐ.వి సుధాకర్,కె.రాజా రామ్మోహన్ రాయ్, ఆర్.లింగరాజు తదితరులు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/91-1.jpg?resize=550%2C367&ssl=1)