NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా ఎస్పీ ఆదేశాల పై ముఖ్య ప్రదేశాల్లో గస్తీలు

1 min read

మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు,మహిళా ఎస్సై కాంతిప్రియ యొక్క ఆధ్వర్యంలో అన్ని కళాశాలలో విద్యార్థిని,విద్యార్థులకు దృశ్యరూపం

మహిళలు,బాలికలు,వృద్ధుల రక్షణ కోసం అభయా మహిళా రక్షణ దళ సభ్యులు అవగాహన కార్యక్రమాలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఏలూరు జిల్లా వ్యాప్తంగా అభయ మహిళా రక్షక దళ సభ్యులు బస్టాండ్లు రైల్వే స్టేషన్  అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో బుధవారం గస్తీలు నిర్వహించినారు.బాలికలు, మహిళలు, వృద్ధుల రక్షణ కొరకుజిల్లా ఎస్పీ  జిల్లాలో  ఏర్పాటు చేసిన వాట్స్ అప్ నెంబర్ 9550351100 గురించి అభయ మహిళా రక్షక దళ సభ్యులు ప్రజలకు వివరించారు. వివిధ ప్రాంతాలలో సైబర్ నేరాల నివారణ కొరకు జాబు ఫ్రాడ్స్, లోన్ ఫ్రాడ్స్, ఏపీకే యాప్‌ల ద్వారా జరిగే మోసాల గురించి ప్రజలకు, విద్యార్థినీ, విద్యార్థులకు  దృశ్య రూపంలో  అభయ రక్షక మహిళా దళ సభ్యులు అవగాహనను కల్పించినారు.సోషల్ మీడియా ద్వారా వెలువడే ముప్పులపై అవగాహన కల్పించారు.అపరిచిత వ్యక్తులు పంపే లింకులు లేదా మెసేజ్‌లు ఓపెన్ చేయకూడదని సూచించారు.అత్యవసర సహాయం కొరకు  టోల్‌ఫ్రీ నెంబర్ డయల్ 112 సేవల గురించి వివరించారు.ఎమర్జెన్సీ సమయాల్లో పోలీస్ సాయాన్ని ఎంత త్వరగా అందించగలమో వివరించారు.బాల్య వివాహాలు చేసేవారిపై తక్షణ చర్యలు తీసుకోవడం కోసం 1098 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.సైబర్ నేరాలకు గురైనవారు 1930 నంబర్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే తక్షణ సహాయం అందుతుందని వివరించారు.ఈ ప్రచార కార్యక్రమం ద్వారా సురక్షిత సమాజ నిర్మాణానికి అవసరమైన సమాచారాన్ని ప్రజలకు అభయ రక్షక దళ సభ్యులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినారు.

About Author