దివ్యాంగులపై ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలి
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/12-6.jpg?fit=550%2C247&ssl=1)
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: దివ్యాంగులపై జాలి కరుణ ప్రేమ ఆప్యాయతలను కలిగి ఉండాలని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ సూచించారు. గురువారం పత్తికొండ స్థానిక భవిత పాఠశాలలో పత్తికొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ తన మనుమరాలైన” ఖ్యాతి “ఆరవ జన్మదిన వేడుకలను భవిత పాఠశాలలో దివ్యాంగుల మధ్య ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భవిత పాఠశాలలో చదువుతున్న పిల్లలకు స్వీట్స్ పంచిపట్టారు. అలాగే వారికి పెన్నులను ,నోట్ బుక్ లను, మరియు రైటింగ్ ప్యాడ్స్ ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భవిత పాఠశాల ఉపాద్యాయులు శ్రీనివాసులు,తేజ కుమార్ ,అటెండర్ సారాబి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/121.jpg?resize=550%2C247&ssl=1)