హెల్మెట్ ధరించడం పై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన .. కలెక్టర్ .. ఎస్పీ
1 min read
ద్విచక్ర వాహనం నడిపే ప్రతిఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.
హెల్మెట్ ధరించడం పై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం.
ప్రణాళికా బద్దంగా రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటాం.
రహదారి భద్రత మనందరి భాధ్యత జిల్లా ప్రజలు, మీడియా సహాకరించాలి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025 లో భాగంగా గురువారం హెల్మెట్ ధరించడం పై జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ చేపట్టారు.హెల్మెట్ పై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హెల్మెట్ అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.హెల్మెట్ ధరించి అవగాహన బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ అవగాహన ర్యాలీ జిల్లా పోలీసు కార్యాలయం నుండి ప్రారంభమై కంట్రోల్ రూమ్, కిడ్స్ వరల్డ్, రాజ్ విహార్,కలెక్టరేట్ మీదుగా సి. క్యాంపు సెంటర్ వరకు కొనసాగింది. జిల్లా కలెక్టర్ శ్రీ పి.రంజిత్ భాషా మాట్లాడుతూ….జాతీయ రహదారి భద్రత వారోత్సవాలలో భాగంగా రోడ్డు భద్రత పై ప్రజలలో అవగాహన కల్పించేందుకే ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి పౌరుడు తన భద్రతకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నరు. క్షేమంగా వెళుతున్నా అవతలి వ్యక్తులు ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి బైక్ లు నడిపి ఇతరులను రోడ్డు ప్రమాదాలకు గురి చేస్తున్నారన్నారు. ఈ ప్రమాదాలలో హెల్మెట్ ధరించకపోవడం వలనే తలకు ఎక్కువగా గాయాలు అయి రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారన్నారు. అందరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారన్నారు. నేషనల్ హైవే అథారిటి, ఆర్ & బి శాఖలతో అవసరమైన చోట్ల సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. 6 నెలలలో ప్రణాళిక బద్దంగా ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తామన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ మాట్లాడుతూ…. జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ భాద్యతగా హెల్మెట్ ధరించాలన్నారు.
వాహనాలు నడపేవిధంగా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. తలకు హెల్మెట్ ధరించి ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేవిధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రహదారి భద్రత మనందరి భాధ్యత, జిల్లా ప్రజలు, మీడియా సహాకరించాలన్నారు. నో పార్కింగ్ ప్రదేశాలలో వాహనచోదకులు వాహనాలు నిలపకూడదన్నారు. ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమిషనల్ శాంతకుమారి, సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ఆర్డీఓ సందీప్ కుమార్, అడిషనల్ కమాండెంట్ నాగేంద్రరావు, అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్ , డిఎస్పీలు, సిఐలు , ఆర్ ఐలు, ఆర్ టి ఓ అధికారులు ఎస్సైలు, ఆర్ ఎస్సై లు, ట్రాఫిక్ పోలీసులు, సివిల్ , ఎఆర్ , ఎపిఎస్పీ SDRF సిబ్బంది, ఆయా షోరూం ల సిబ్బంది, డ్రైవింగ్ స్కూళ్ళ వారు సుమారు 700 మంది హెల్మెట్ ర్యాలీ పాల్గొన్నారు.