తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవికి రాజీనామా ..చల్లా అనుదీప్
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/8-6.jpg?fit=550%2C656&ssl=1)
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కి నమస్కరించి రాయడం ఏమనగా చల్లా అనుదీప్ కుమార్ నా సొంత గ్రామము డోన్ నియోజకవర్గం ప్యాపిలి నేను గత 14 సంవత్సరాలుగా నేను తెలుగు దేశం పార్టీలో పని చేస్తున్నాను. నాకు రెండు సంవత్సరాల క్రితం నా కష్టానికి గుర్తింపుగా నంద్యాల జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించడం జరిగింది. అప్పటినుంచి నేను తెలుగుదేశం పార్టీలో మరింత చురుకుగా పనిచేయడం జరిగింది . ప్రస్తుత ఎమ్మెల్యే అయిన శ్రీ కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గెలుపుకోసం కృషి చేయడం జరిగింది కావున ఇప్పుడు నా వ్యక్తిగత కారణాలవల్ల నేను నంద్యాల జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇందులో ఎటువంటి ఒత్తిళ్లు కానీ ప్రలోభాలు గాని లేవు. నేను నా వ్యక్తిగత కారణాలు చేతనే ఈ పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. కావున నా యొక్క రాజీనామా పత్రాన్ని ఆమోదించవలసిందిగా కోరుచున్నాను. నాకు ఈ పదవి రావడానికి కారణమైనటువంటి అప్పటి ఇన్చార్జ్ అయినా మన్నే సుబ్బారెడ్డి కి మరియు వై నాగేశ్వర యాదవ్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.