గోడపత్రికల ఆవిష్కరణ…
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/8-7.jpg?fit=550%2C287&ssl=1)
పల్లెవెలుగు వెబ్ మహానంది: మహనంది నంద్యాల జిల్లా, మహానంది పుణ్యక్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మొత్సవాల వాల్ పోస్టర్ల ను శనివారం ఆవిష్కరించారు.క్షేత్రంలో 5రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర నలుమూలలా తెలియజేసేందుకు ఊరూరా వాల్ పోస్టర్ల ను అతికించడం జరుగుతుందని ఈఓ శ్రీనివాస రెడ్డి తెలిపారు. అంతకుముందు వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, హనుమంతు రావు,ప్రధాన అర్చకులు అర్జున్ శర్మ లు వాల్ పోస్టర్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా ఈఓ మాట్లాడుతూ శివరాత్రి ఉత్సవాలను అందరి సహకారంతో విజయ వంతం చేస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో ఏ ఈఓ మధు, ఏ ఈ శ్రీనివాసులు, సూపర్డెంట్ శశిధర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు(చిన్న),ఉప ప్రధానఅర్చకులు జనార్దన్ శర్మ,ములస్థానం శంకరయ్య,రాజ మాణిక్య శర్మ,మణికంఠ,జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.