కంపు కొడుతున్న పట్టించుకోరా… తరలించాలంటే అలసత్వం ఎందుకు
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/13-7.jpg?fit=550%2C248&ssl=1)
పల్లెవెలుగు వెబ్ మహానంది : కంపు కొడుతున్న పట్టించుకోరా… తరలించాలంటే అలసత్వం ఎందుకు అని పలువురు భక్తులు మహానంది దేవస్థానం ఆలయ అధికారులను ప్రశ్నిస్తున్నారు. క్షేత్రంలోని ప్రధాన కోనేరు వద్ద ఉన్న మండపాల్లో స్త్రీలు పుణ్యా స్నానాల అనంతరం దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాట్లు చేశారు. అంతవరకు బాగానే ఉన్నా అక్కడ కొందరు స్త్రీలు మూత్ర విసర్జన చేయడం వల్ల కంపు కొడుతూ దుర్గంధం వెదజల్లుతున్నట్లు భక్తుల నుండి ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల కోనేరు చుట్టుపక్కల కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. దుస్తులు మార్చుకునే ప్రదేశాన్ని చిన్న కోనేరు పరిసర ప్రాంతాల్లో నికి తరలించాలని పలువురు కోరుతున్నారు. అమ్మవారి ఆలయం సమీపంలోనే మూత్ర విసర్జన జరుగుతుందని విమర్శలు వెలువెత్తుతున్నాయి మరి ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.