వైభవంగా సాలే బసప్ప స్వామి రథోత్సవం
1 min read
భారిగా తరలి వచ్చిన భక్తులు
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: మండల పరిధిలోని మాధవరం గ్రామంలో వెలసిన శ్రీ సాలే బసప్ప స్వామి రథోత్సవం గ్రామ ప్రజల అధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాలే బసప్ప స్వామి కి ఉదయం నుండి నంది కోల సేవ, అన్న సంతర్పణ, తుంగభద్ర నది జలాలతో అభిషేకాలు, పంచామృతభిషకం వంటి విషేశ పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం గుడి వద్ద నుండి రాయచూరు రోడ్డు వరకు బాణాసంచా కాల్చి భక్తుల హర్షధ్వనుల మద్య భాజభజంత్రీల మద్య డోలు డప్పుల మద్య ఊరేగించారు. వివిధ రకాల విద్యుత్ దీపాలతో, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బిసి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు పైబావి అమర్నాథ్ రెడ్డి, వీరన్న స్వామి, నవకోటి నారాయణ, పైబావి నర్సిరెడ్డి, నర్సిరెడ్డి, సాయి నాథ్ రెడ్డి, డీలర్ లక్ష్మణ, రాఘవేంద్ర రెడ్డి, ముకరాల అంజిని, ఉప్పర అంజి, మంచాల సురేష్, జాఫర్, గుడిసే నరసింహులు, వడ్డే యల్లప్ప, ఆలూరు ఉరుకుందు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
