చిన్నారుల్లో పుట్టుకతో వైకల్యాలను గుర్తించడానికి ఇంటింటి సర్వే
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆదేశాల మేరకు 0 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారుల్లో పుట్టుకతో ఉన్న లేదా ప్రాథమిక దశలో గుర్తించగల వైకల్యాలను గుర్తించడానికి ఇంటింటి సర్వేలో 42 వార్డు ఇల్లూరు నగర్, ఇందిరా గాంధీ నగర్ లో పారా లీగల్ వాలంటీర్ మరియు చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీం కమిటీ మెంబర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఏ.ఎన్.ఎం జీవిత, ఆశా వర్కర్ టీ.వీ పుష్పావతి, అంగన్వాడి వర్కర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు జరిగే ఇంటింటి సర్వేలో ప్రాథమిక దశలో గుర్తించగలిగిన వైకల్యాలను ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న డి .ఈ. ఐ. సి సెంటర్ కు పంపించడం జరుగుతుందన్నారు .శారీరక, మానసిక, వినికిడి ,మరియు మాట ఉచ్చారణ సమస్యలు, గ్రహణం ముర్రి సమస్య, నెలలు నిండక ముందే పుట్టిన పిల్లల సమస్యలను డి.ఇ.ఐ.సి ద్వారా పూర్తిగా ఉచితంగా పరిష్కరించి చిన్నారుల జీవనం నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహించనున్నామన్నారు.