పెద్దతుంబలం అభివృధ్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/3-8.jpg?fit=550%2C309&ssl=1)
పెద్దతుంబలం గ్రామ అభివృద్ధికి మా కూటమీ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తెలిపారు.
సోమవారం పెద్ద తుంబలం గ్రామంలో ప్రైమ్ మినిస్టర్ రైసింగ్ ఆఫ్ స్కూల్స్
పల్లెవెలుగు వెబ్ ఆదోని: సెంట్రల్ స్కీం ద్వారా జెడ్పి పాఠాశాల అదనపు గదుల అభివృద్ధి కార్యక్రమము మరియు కేంద్ర ప్రభుత్వ ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా విడుదలైన నిధులతో గ్రామములో సీపీ రోడ్డు పనులను సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ పెద్ద తుంబలం గ్రామ కూటమి నాయకులంతా ఐక్యంగా గ్రామములోని సమస్యలను తెలుసుకుని సిసి రోడ్డు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, వీది దీపాలు కావచ్చు, త్రాగు నీరు కావచ్చు మొదలైన మౌలిక సదుపాయాలు గ్రామ ప్రజలకు అందించడం ధ్యేయంగా నాయకులంతా కృషి చేస్తున్నారని. వారికి ఏ సహకారం కావాలన్నా ఎమ్మెల్యేగా నేను ముందుండి వారికి అన్ని రకాలుగా తోడుంటానని తెలియజేశారు. పెద్ద తుంబలం గ్రామంలో ఇక వైఎస్ఆర్సిపి ఆటలు సాగవని మర్యాదగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తమ దౌర్జన్యాలు ఆపాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని, అభివృద్ధి పనులకు వైఎస్ఆర్సిపి అడ్డు వస్తే ఉపేక్షించేది లేదని, అలాంటి వారీ పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.కార్యక్రమంలో బిజెపి, టిడిపి, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.