డి ఏ అరియర్స్ విడుదల చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది దేవస్థానంలో పనిచేసే ఉద్యోగుల డిఏ అరియర్స్ ను విడుదల చేయాలని వాదన వినవస్తుంది. దాదాపు సంవత్సరం నుంచి డిఏ బకాయిలు నిలిచిపోయినట్లు సమాచారం. మిగిలిన బకాయిలు చెల్లించిన అధికారులు డిఏ బకాయిలు మాత్రం విడుదల చేయలేదని తెలుస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ఉద్యోగులకు డిఏ అరియర్స్ విడుదల చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. డి ఏ అరియర్స్ కు సంబంధించిన ఫైలు ముందుకు కదలడం లేదని అవరోపణలు వినవస్తున్నాయి. ఆలయ అధికారులు సంబంధిత పై ఫైళ్లను పక్కన పెట్టారా లేక అవి అధికారుల ముందు ఉంచాల్సిన సిబ్బంది ఆ పని చేయలేకపోతున్నారా అనేది తెలియ రావడం లేదు.