NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మణిపూర్ సీఎం  రాజీనామా పై నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ హర్షం వ్యక్తం

1 min read

హర్షం వ్యక్తం చేసిన నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు

ముఖ్యమంత్రి పనితీరుపై పలువురు విమర్శలు చేశారని ఆరోపణ

దళితులు,క్రైస్తవులు,ఎస్టీలు బిజెపికి వ్యతిరేకం కాదు

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: మణిపూర్  లో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టే ముందుగానే మణిపూర్ ముఖ్యమంత్రి బిర్ న సింగ్  రాజీనామా చేయటం పై నేషనల్ దళిత జేఏసీ చైర్మన్,ప్రముఖ న్యాయవాది పెరికె వరప్రసాదరావు హర్షం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా మణిపూర్ లో సాగుతున్న అల్లర్ల నిమిత్తం మణుపూర్ ముఖ్యమంత్రి బీరిన్ సింగ్ పనితీరుపై పలువురు విమర్శలు చేశారని మైటీస్,కుకీస్,ఎస్టీ క్రైస్తవులపై దారుణంగా గతంలో దాడులు జరిగాయని మహిళలను అత్యంత దారుణంగా వివస్త్రలను చేసి చంపారని ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేసిన శిబిరాల్లో లక్షల మంది తలదాచుకుంటున్నారని, వారిని తక్షణమే వారి గృహాలకు పంపించాలని మణిపూర్లో సాధారణమైన వాతావరణం కల్పించాలని దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నరు. అక్కడ మరణించిన మైటీస్ కి కుక్కిస్ ఒక్కొక్కరికి కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి  అమిత్ షాను కలిసిన తర్వాత రాజీనామా నిర్ణయం చాలా సంతోషంగా ఉందని వెంటనే గవర్నర్ రాజీనామా లేఖను ఆమోదించారని దళితులు, ఎస్టీలు, క్రైస్తవులు బిజెపికి వ్యతిరేకం కాదని దళిత క్రైస్తవులకు భారతదేశంలో మత స్వేచ్ఛ హక్కుల రక్షణ ఉన్నాయని,భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలని,మత స్వేచ్ఛ హక్కుల రక్షణ కల్పించాలని పెరికె వరప్రసాదరావు ఒక ప్రకటనలో కోరారు.

About Author