ఏలూరు జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/7-8.jpg?fit=550%2C367&ssl=1)
ఆహ్వానం పలికిన నియోజకవర్గ ఇన్చార్జిరెడ్డి అప్పలనాయుడు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఏలూరు పర్యటనలో భాగంగా ఆదివారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ఆహ్వానం మేరకు రాష్ట్ర పర్యటకశాఖ మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ సందర్శించారు. ఏలూరు పార్టీ కార్యాలయంలో మంత్రి దుర్గేష్ కు జనసైనికులు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కందుల మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ని అఖండ మెజార్టీతో గెలిపించి, కూటమి ప్రభుత్వానికి విజయాన్ని అందించాలని, తద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులకు, ఉపాధి కల్పనకు, తోడ్పాటు జరుగుతుందని, అలాగే గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసిందో ప్రజలంతా కల్లారా చూశారని, అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఉభయగోదావరి జిల్లాల ప్రజలు కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని, పట్టభద్రులు ఈ ఎన్నికలని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను మంత్రి కందుల కోరారు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రైతులకు 48 గంటల్లో బకాయిలను చెల్లించడం జరుగుతుందని, పర్యాటక రంగం సైతం అభివృద్ధి చెందుతుందని, ప్రతి గ్రామంలో పంచాయతీ, పంచాయతీరాజ్ విధులను సక్రమంగా జరిగేలాగా మరియు అటవీ ప్రాంతాల్లో రోడ్ల మార్గం, విద్యుత్తు సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చి, అభివృద్ధిని చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాని కొల్లగొట్టి చిల్లు గవ్వ లేకుండా చేసినప్పటికీ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లోనే మూడు వేల పెన్షన్ నీ నాలుగు వేలుకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు.గత ప్రభుత్వంలో 2000 నుండి 3000 కు పెన్షన్ పెంచడానికి వైసిపి ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు పట్టిందని విమర్శించారు. అలాగే సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమపాళ్లల్లో జరగాలంటే కూటమి ప్రభుత్వం బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖరంని భారీ మెజారిటీతో గెలిపించాలని మీడియా ముఖంగా ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి , జనసేన సీనియర్ నాయకులు నారా శేషు, జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, కో- ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/71-2.jpg?resize=550%2C367&ssl=1)