టాపర్ కోచింగ్ సెంటర్ ను సీజ్ చేయాలి – ఏబీవీపీ
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/16-6.jpg?fit=550%2C365&ssl=1)
సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఏబీవీపీ నాయకులు
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అక్రమంగా నడుపుతున్న టాపర్ కోచింగ్ సెంటర్ ను సీజ్ చేయాలని ఆదోని సబ్ కలెక్టర్ గారికి ప్రజాదర్బార్ లో వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏ బి వి పీ జిల్లా నాయకులు మారుతి మాట్లాడుతూ ఎమ్మిగనూరులో ఉన్నటువంటి టాపర్ నవోదయ కోచింగ్ సెంటర్ ను ఎటువంటి అనుమతులు లేకపోయినా నడపడం జరుగుతుందని విద్యార్థులు పాఠశాల సమయంలో పాఠశాలలో ఉండకుండా ఈ కోచింగ్ సెంటర్ లో ఉండడం జరుగుతుంది.ఈ కోచింగ్ సెంటర్లో ఎలాంటి మౌలిక వసతులు లేకపోయినా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి 70 నుండి 60000 వసూలు చేయడం జరుగుతుంది తల్లిదండ్రులు నా కొడుకు నా బిడ్డ చదువుకోవాలని ఇన్ని ఫీజులు కడుతుంటే టాపర్ యాజమాన్యం మాత్రం విద్యార్థులతో మట్టి మోహించడం బాధాకరమైనటువంటి విషయమని అదేవిధంగా విద్యార్థుల హాస్టల్ వసతి కల్పిస్తామని విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాండడం జరుగుతుందని వారు అన్నారు కావున మీరు దీనిపైన విచారణ జరిపి ఈ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ లేని పక్షంలో ఈ సమస్య పైన వారిని ఉద్యమాలకు పూనుకుంటామని వారు హెచ్చరించారు.