NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాగేశ్వర్ రెడ్డికి ఘనసన్మానం

1 min read

ఏపీ వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కావడంపై సభ్యుల హర్షం

కర్నూలు, పల్లెవెలుగు: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన   నాగేశ్వర్ రెడ్డిని మంగళవారం ఆ శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు.  జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో  ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చాంద్​ బాషా, మనోహర్​ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా  జేడీ వరలక్ష్మి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులను సమన్వయం చేసుకుని.. లక్ష్యం దిశగా అడుగులు వేసే ఏఓ నాగేశ్వర రెడ్డిని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడం అభినందనీయమన్నారు.  అనంతరం  పీ.డి., డీ.పీ.డి, వ్యవసాయ  అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి, ఏపీ ఎన్జీవోస్ కర్నూలు జిల్లా కార్యదర్శి కృష్ణుడు,  కర్నూలు నగర శాఖ అధ్యక్షులు ఎం.సీ. కాశన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైపిస్టు & స్టెనోగ్రాఫర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బి.సీ. శంకర్ నాయక్, తదితర ప్రముఖులు హాజరై  నాగేశ్వర్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.

కర్నూలు జిల్లా ప్రతినిధుల ప్రాతినిధ్యం

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి రవికుమార్,ఉపాధ్యక్షులు.వై.శ్రీధర్ సంయుక్త కార్యదర్శి, టి. భాస్కర్, మరియు ఎస్.రియాజ్ బాషా EC మెంబర్లుగా  ప్రాతినిధ్యం లభించడం పట్ల  సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

 పదవికి న్యాయం చేస్తా.. :నాగేశ్వర రెడ్డి

తనపై నమ్మకం ఉంచి ఏపీ వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసిన నాగేశ్వర రెడ్డి… తనకు అప్పగించిన బాధ్యతకు న్యాయం చేస్తానని ఈ సందర్భంగా హామీ  ఆయన ఇచ్చారు.

About Author