10 పరీక్షల్లో సత్తా చాటిన శ్రీ రాజరాజేశ్వరి విద్యా సంస్థ..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలోని శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించారు సోమవారం నాడు ప్రభుత్వం విడుదల చేసిన పది పరీక్షల ఫలితాలలో మండలంలోని. ప్రథమ స్థానంలో యస్. కమీరా D/O యస్. ఖాజాపిర్ 574/600 మార్కులు, ద్వితీయ స్థానంలో కె.నందకిషోర్ S/o కె.మల్లయ్య 572/600, కె.ఈశ్వర్ S/o కె.రామసుబ్బయ్య 572/600 మార్కులు, తృతీయ స్థానంలో యన్.ముఖేష్ S/o యన్.మహేశ్వర గౌడ్ 566/600 మార్కులను సాధించారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి 500 మార్కులకు పైగా రావడం . 500 మార్కులకు పైగా 20 మంది విద్యార్థులు సాధించారని పాఠశాలలో 95% విద్యార్థులు ఉత్తీర్ణత ఉత్తమ ఫలితాలను సాధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ యం. రామేశ్వర రావు , మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి మండలంలో ఉత్తమ క్రమశిక్షణతో విద్యాబోధన తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ర్యాంకులు రావడానికి కారణమని కష్టపడి చదివిన విద్యార్థులకు అభినందించారు A.O శ్రీ యం.బి.యన్. రాఘవేంద్ర రావు ,ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లితండ్రులు అభినందించారు.