NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశ్రీశ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లిని దర్శించుకున్న సూర్య ఎంటర్ప్రైజెస్ అధినేత

1 min read

పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు

భక్తులతో సందడే సందడి, కోలాహలంగా,ఉత్సాహ

భరితంగా యువత భక్తులకు అసౌకర్యాలు కలవకుండా పోలీస్,మెడికల్ క్యాంప్ తో ప్రత్యేక పర్యవేక్షణ

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: గాలాయగూడెం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లి అమ్మవారి 68వ వార్షికోత్సవాల సందర్భంగా సూర్య ఎంటర్ప్రైజెస్ అధినేత చామర్తి కృష్ణారావు సోమవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికి పుష్పగుచ్చాలు అందించి, శాలువా కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రత్యేక అలంకరణ లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతిరోజు రోజు రాత్రి  అపూర్వమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. కావున నేడు కూడా  మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి అమ్మవారి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులతో ఆస్వాదించఅన్నరు.అమ్మవారి ఆశీర్వచనములు తీసుకోవలసిందిగా కోరుతున్నామన్నరు. వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా ఉత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు ఉత్సవాలకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు మా గాలయగూడెం గ్రామము తరపున మరియు అచ్చమ్మ పేరంటాల తల్లి ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక పర్యవేక్షణలో మెడికల్ క్యాంప్ ఏర్పాటుచేసి,పోలీస్ మరియు కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.

About Author