పదో తరగతి బాలిక ఎన్ మతీనా కు అభినందనలు
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖ వెలువరిస్తున్న మనబడి మాసపత్రికలో కర్నూలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఉర్దూ) కు చెందిన 10వ తరగతి బాలిక ఎన్. మతీనా కవిత ప్రచురితమవడం పట్ల విద్యాశాఖ పక్షాన అభినందనలు తెలియజేయడమైనది. ఉర్దూ మాధ్యమానికి సంబంధించిన ఉన్నత పాఠశాలలో రెండో మధ్యమంగా తెలుగు చదివి తెలుగు భాషా సాహిత్యాలలో ప్రతిభ కనబరచడం విశేషం. ఇందుకు ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను అభినందిస్తున్నాను. మన ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన పత్రిక మనబడిలో మరిన్ని రచనలు రావాలని ఆకాంక్షిస్తున్నాను.