NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అధునాతన టెక్నాలజీతో మొబైల్ ఫోన్ల రికవరీ

1 min read

14వ దఫా 638 మొబైల్ ఫోన్ లను రికవరీ చేసిన పోలీసులు

ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేసిన బాధితులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నేతృత్వంలో సిసిఎస్ పోలీసులు, సైబర్ క్రైమ్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా, గత మూడు నెలలో దొంగిలించబడిన మరియు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ల ను జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ మరియు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌ని ఉపయోగించి, 14వ ధపా లో భాగంగ ఇప్పటి వరకు  638 మొబైల్ ఫోన్ల రికవరీ చేసినారు వాటి యొక్క విలువ రూ. 76,56,000/-

ఈ మొబైల్ ఫోన్ లను ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్ జిల్లా, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖ, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు  తదితర ప్రదేశాలలో ప్రస్తుత యూజర్స్  నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది.

ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ యొక్క వివరాలు :

మొదటి ధపా నుండి 14 వ ధపా వరకు   పోయిన సెల్ ఫోన్లు 2398 రికవరీ చేసినట్లు వాటి యొక్క విలువ సుమారు రూ.4,06,39,684/- దొంగిలించబడిన వస్తువులను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం శిక్షార్హమైన నేరం కాబట్టి వాటిని నివారించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.  వారిపై  సెక్షన్ 317 భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారం కేసు నమోదు చేయబడును, 3 సంవత్సరాలు వరకు  జైలు శిక్ష విధించబడును.మీ వస్తువులను కాపాడుకోండి, అప్రమత్తంగా ఉండండి.. వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేసేందుకు అనుచిత వీడియో కాల్స్ వంటి ఎత్తుగడలతో మోసగాళ్లు సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ప్రజలకు సూచించారు. UPI మోసాలకు వ్యతిరేకంగా మరియు పౌరులు తమ మొబైల్ పరికరాలను ముఖ్యంగా అనుమానాస్పద లింక్‌లను నివారించడం ద్వారా జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

ప్రజలు తాము  పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్‌లను వారి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో CEIR పోర్టల్ ద్వారా వెంటనే రిపోర్ట్ చేయమని కోరడమైనది.  ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉంది. దొంగిలించబడిన ఫోన్‌ల దుర్వినియోగాన్ని నిరోధించడానికి మరియు రికవరీ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి CEIR పోర్టల్ సహాయపడుతుందని ఆయన నొక్కిచెప్పారు. సైబర్ క్రైమ్ సంబంధిత విషయాల కోసం, ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేయడానికి 1930కి కాల్ చేయాలని లేదా cybercrime.gov.inని సందర్శించాలని ఆయన ప్రజలకు సూచించారు.

నివారణ చర్యలు :

సెల్ఫోన్ నేరస్థులు & అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ల ప్రతి రోజు నేరలు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ లు బ్యాంకులు, ATMలు, రైతు బజార్లు రద్దీ ప్రదేశాలలో ప్రజల యొక్క అప్రమత్తత లేకపోవడం వలన మొబైల్ హ్యాండ్సెట్లను దొంగిలించడం జరుగుతుందని,  ప్రజలలో సెల్ ఫోను పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని,  సెల్ఫోన్లో గోప్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవాలని,  యాప్లకు బలమైన పాస్వర్డ్ రక్షణ, ఫోన్ యొక్క ప్రత్యేక ఐడి నంబర్ను జాగ్రత్త పెట్టడం, Find my Devise option పెట్టడం,  మీ ఫోటోలు మరియు వీడియోలను బ్యాకప్ చేయడం, వంటివి అలవాటు చేసుకోవాలి.  IMEI ఆధారిత సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్, టాబ్లెట్లు మొదలైనవాటిని సరైన బిల్లు/Documents/ మరియు ID రుజువు మొదలైనవి లేకుండా అనుమతించకూడదని అన్ని మొబైల్ దుకాణాలు / మరమ్మతు దుకాణాల యజమానులకు నోటీసులు జారీ చేయబడ్డాయి.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పి ఎన్ సూర్య చంద్ర రావు, ఏలూరు డి.ఎస్.పి డి శ్రావణ్ కుమార్,  ఏలూరు సిసిఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు  మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

About Author