PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిష్పక్షపాతంగా నిబంధనల ప్రకారం పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలి

1 min read

పివో, ఏపివో ల మొదటి విడత శిక్షణా కార్యక్రమం

ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఎమ్మెల్సీ ఎన్నికల  పోలింగ్ విధులను బాధ్యతగా స్వీకరించి నిష్పక్షపాతంగా, నిబంధనల ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఎమ్మెల్సీ పోలింగ్ అధికారులకు సూచించారు.బుధవారం  స్దానికి కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో ఈనెల 27వ తేదీన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభధ్రుల ఎన్నికల సందర్బంగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పివో, ఎపివో లకు మొదటి శిక్షణాతరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతికి జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎన్నికల పరిశీలకురాలు కె. సునీత, జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డితో కలిసి శిక్షణా తరగతులకు హాజరయ్యారు.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గ ఎన్నికలకు ఈనెల 27వ తేదీన ఉదయం 8 గం. నుండి సాయంత్రం 4 గం. వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.  తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభధ్రుల ఎన్నికలకు 3,14,984 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటారని తెలిపారు. ఏలూరు జిల్లా పరిధిలో 62 పోలింగ్ కేంద్రాల్లో 42,282 మంది ఓటర్లు కలిగియున్నారని ఇందులో పురుషులు 24,704 మంది, మహిళలు 17,571 మంది, ట్రాన్స్ జెండర్లు 7 గురు ఉన్నారని తెలిపారు. పోలింగ్ ముందురోజు ఏలూరులో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో పోలింగ్ సామాగ్రిని అందజేస్తామని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ అనంతరం బ్యాలెట్ బాక్సులు పోలింగ్ సామాగ్రితో సహా ఏలూరులో ఉన్న స్ట్రాంగ్ రూమ్ కి అత్యంత జాగ్రత్తగా చేర్చాలన్నారు. ఎన్నికల పోలింగ్ సంబంధించి పివో, ఏపివోలు ఎన్నికల కమీషన్ సూచించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి తు.చ. తప్పకుండా పకడ్బందీగా, నిష్పక్షపాతంగా పోలింగ్ ప్రక్రియను ముగించాలని తెలిపారు. పివో, ఎపివోలకు సంబంధించి మొదటి విడతగా శిక్షణా కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ ఇచ్చిన శిక్షణ ద్వారా ఎన్నికల పోలింగ్ సమయంలో ఎటువంటి పొరపాట్లు జరుగకుండా ఉండటానికి శిక్షణాకార్యక్రమం దోహదం చేస్తుందన్నారు.  ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా మరి ముఖ్యంగా బ్యాలెట్ బాక్సు ఆపరేటింగ్, బ్యాలెట్ పేపర్లు పరిశీలన, పివో డైరీ నిర్వహణ ముఖ్యమైన ఘట్టాలని తెలిపారు. గత ఎన్నికల్లో అనుభవాన్ని జోడించి సజావుగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలన్నారు.ఈ శిక్షణాతరగతుల్లో మాస్టర్ ట్రైనిస్ శ్రీనివాస్, ఫణి వారిచే ఓటు వేసే విధానంపై , పోలింగ్ సిబ్బంది నియామకం, పోలింగ్ మెటీరియల్స్, ముఖ్యమైన ఎన్నికల సామాగ్రి తనిఖీ, పోలింగ్ కేంద్రానికి చేరిన వెంటనే చేయాల్సిన విధులు, పోలింగ్ రోజు విధులు, పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు, మొదటి, రెండు పోలింగ్ కేంద్రాల పోలింగ్ అధికారి విధులు, పోలింగ్ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు, పోలింగ్ కేంద్రంలోని ప్రవేశ అర్హత, ఓటరు జాబితా,ఛాలెంజ్ ఓటు, టెండర్ ఓటు, అంధులు మరియు నిస్సహాయ ఓటర్లు, బ్యాలెట్ బాక్సు సిద్ధం చేయడం, పోలింగ్ ఏజెంట్లు గమనించాల్సిన అంశాలు, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది.  ఎన్నికల అధికారులకు బ్యాలెట్ బాక్సు ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం ప్రాక్టికల్ గా కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, జెడ్పి డిప్యూటీ సిఇఓ భీమేశ్వర్, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ముక్కంటి, పివో, ఏపివోలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *