NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయస్థాయి పోటీ పరీక్ష…

1 min read

2025 సెషన్ -1 పర్సన్టైల్ పరీక్ష ఫలితాల్లో ఏలూరు ‘ఎన్ఆర్

ఐ’ విద్యార్థుల విజయభేరి

విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు

కళాశాల సీఈవో వి.తులసీరామ్

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లాప్రతినిధి: ఏలూరు జాతీయ స్థాయి పోటీ పరీక్ష JEE(Main)-2025, సెషన్ – 1 పర్సన్టైల్ పరీక్షా ఫలితాలలో ఏలూరు ఎన్​ఆర్​ఐ విద్యార్ధుల విజయభేరి నిన్న ప్రకటించిన JEE(Main) సెషన్ 1 ఫలితాలలో ఏలూరు ఎన్​ఆర్​ఐ జూనియర్ కళాశాల విద్యార్థుల అద్భుత ఫలితాలు సాధించారని కళాశాల సీఈఓ  వి.తులసీరామ్ తెలియజేశారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో అద్భుత పర్శంటైల్ సాధించిన ఎన్​ఆర్​ఐ కళాశాల విద్యార్థుల వివరాలు తెలియజేశారు. వి.సాయివర్షిత్ – 99.10 పర్శంటైల్, వై.భానుకార్తికేయ – 98.50 పర్శంటైల్, యం. కాశీనాగవిష్ణు – 98.00 పర్శంటైల్, పి.సత్యసాహితి 97.53 పర్శంటైల్, డి.పూర్ణవెంకట శ్రీనివాస్ 94.70 , సాధించారని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్ధులను వారి తల్లిదండ్రులను కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించిన తర్వాత కళాశాల సీఈఓ వి. తులసీరామ్ మాట్లాడుతూ కేవలం అనుభవం మరియు అంకితభావం గల సీనియర్ అద్యాపకుల యొక్క వివరణాత్మకమైన భోదన, యర్రర్ ఎనాలసిస్, డిజిటల్ క్లాస్ల ద్వారా భోదన, గ్రాండ్ టెష్ట్ ఎనాలసిస్ మరియు విద్యార్థుల కృషితో ఈ అద్భుత ఫలితాలు సాధించారని తెలియజేశారు. ఈ అద్భుత ఫలితాల సాధనలో ప్రముఖ పాత్ర వహించిన సీనియర్ అద్యాపకులను విద్యార్ధులను కళాశాలల సెక్రటరీ కరస్పాండెంట్  ఆలపాటి రాజేంద్రప్రసాద్ కళాశాలల చైర్మన్ ఆలపాటి రవీంద్రలు ఫోన్ ద్వారా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్స్ వి. కనకరత్నం, ఇ. మురళీకృష్ణ, పి.వి. సురేష్, కె. ప్రభాకరరావు, ఎస్.సత్యనారాయణ, సిహెచ్. శివకుమార్ మరియు కళాశాల  ఏవో లు కె.మల్లిఖార్జునరావు, వి.రాట్నాలు,ఎస్. రామాంజనేయులు,జె. నాగరాజు మరియు అద్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author