అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి అగ్నిగుండ ప్రవేశం
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/19-8.jpg?fit=550%2C775&ssl=1)
నిప్పుల గుండం తొక్కిన వేలాదిమంది భక్తులు
కిటకిటలాడిన శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: గాలాయిగూడెం శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయంలో తొమ్మిదవ రోజు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఆవరణలో ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో వేలాది మంది భక్తులు అగ్ని ప్రవేశం చేశారు. తొలుత గాలయగూడెం శ్రీఅచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు అగ్ని ప్రవేశం చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేలాది మంది భక్తులు అమ్మవారి నిప్పుల గుణం తొక్కేరు. ప్రతి ఒక్కరూ పాల్గొని భక్తిశ్రద్ధలతో పరవశించారు.