కన్సాలిడేషన్లో స్టాక్ సూచీలు
1 min readపల్లెవెలుగు వెబ్ : గత మూడు రోజులుగా నష్టాల్లో కొనసాగిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు.. ఈరోజు కన్సాలిడేట్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా యూస్ మార్కెట్ ఫ్యూచర్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యూరోపియన్ మార్కెట్లు కూడ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉదయం స్వల్ప నష్టాలతో మొదలై కన్సాలిడేట్ అవుతున్నాయి. మధ్యాహ్నం 1.30 సమయంలో నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 15,730 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 34,890 వద్ద ట్రేడ్ అవుతోంది.