గోవులను కళేబరాలకు విక్రయిస్తారా..!
1 min readదుర్గారపు పనులు చేసే ఎమ్మెల్యే అనుచరులను వదలను…
- తాటాకు చప్పళ్లకు బెదరను…
- భూ దందాలు,కబ్జాలు మానుకో…
- ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేసిన కూటమి అభ్యర్థి డా. పార్థసారధి
- కుప్పగల్లో కూటమినేతల ప్రచారానికి విశేష స్పందన…
ఆదోని, పల్లెవెలుగు:మండలంలోని కుప్పగల్ గ్రామంలో వెలిసిన తిమ్మప్ప స్వామి దేవాలయానికి చెందిన 40 గోవులను… సొమ్ము చేసుకున్న ఎమ్మెల్యే అనుచరుడు, పూజారి హరిప్రసాద్ రెడ్డిని ఊరికేవదలనని…శిక్ష తప్పదని హెచ్చరించారు ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి. మంగళవారం నియోజకవర్గంలోని కుప్పగల్ గ్రామంలో కూటమి( బీజేపీ–జనసేన– టీడీపీ) నేతలు విస్తృత ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా అభ్యర్థి డా. పార్థసారధి మాట్లాడుతూ భూకబ్జాలు…దందాలు చేసిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి …తన అనుచరులతో దుర్మార్గపు పనులు చేయించాడని ధ్వజమెత్తారు. తిమ్మప్ప స్వామి దేవాలయంకు సంబంధించిన 40 గోవులను విక్రయించిన సదరు పూజారిని…. తాను ఎమ్మెల్యే అయిన వెంటనే చెట్టుకు కట్టేసి శిక్షిస్తామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానన్నారు. కుప్పగల్ గ్రామస్తుల కోరిక మేరకు తిమ్మప్ప స్వామి దేవాలయంలో కళ్యాన మండపం కట్టిస్తానని హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే… అందుబాటులో ఉండి సేవ చేస్తానని, భూ కబ్జాలు, దందాలు, మద్యం, ఇసుక ను బ్లాక్ మార్కెట్ కు తరలించే దుర్మార్గపు పనులు చేయనని ఈ సందర్భంగా అభ్యర్థి డా. పార్థసారధి ప్రజలకు స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి… వేయించి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.