బీసీల అభ్యున్నతే ధ్యేయం..
1 min readప్రధాని నరేంద్రమోదీ బీసీల పక్షపాతి
- బీసీ యువతీయువకులకు ఉపాధి కల్పిస్తాం…
- ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి
ఆదోని, పల్లెవెలుగు:దేశంలోని బీసీల అభ్యున్నతే ధ్యేయంగా ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారన్నారు ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి. మంగళవారం ఆదోని మండలంలోని జాలిమంచి, మల్లేకల్లు, పాడేగల్లు, కుప్పగల్లు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా డా. పార్థసారధి మాట్లాడుతూ దేశ ప్రధాని బీసీ నేత అని…. బీసీల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. బీసీల క్షేమం కోసం…బీసీల అధ్యయనం చేసేందుకే తనను ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారని, అందులో భాగంగా తాను బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ఓ పథకం రూపొందించామని, తాను గెలిచిన వెంటనే ఆదోని నియోజకవర్గంలో అమలు చేస్తానన్నారు.
బీసీ యువతీ యువకులకు ఉపాధి
నియోజకవర్గంలో ఉన్నత చదువులు చదివి… ఖాళీగా ఉన్న బీసీ యువతీ యువకులకు వారికి ఆసక్తి ఉన్న వివిధ రంగాలలో ఉచిత శిక్షణ ఇచ్చి…ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి తెలిపారు. ఎవరెవరికి ఏయే రంగాల్లో ఆసక్తి ఉంటే…ఆ రంగంలోకి వెళ్లేందుకు ఆర్థికంగా ప్రోత్సహిస్తామన్నారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే…. కేంద్ర పథకాలను ఆదోనిలో అమలయ్యేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప, గుడిసె కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.