సొంత ఊరికి సాయం చేయడం చాలా సంతోషంగా ఉంది
1 min read
న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి, నాగభూషణం రెడ్డి
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: మేము పుట్టి పెరిగిన సొంత ఊరికి మా వంతు సాయం చేయడం చాలా సంతోషంగా ఉందని న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి నాగభూషణ రెడ్డిలు అన్నారు… ప్యాపిలి మండలంలోని సిద్ధన గట్టు గ్రామంలో వారి తండ్రి అయిన నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా ఎం ఎన్ ఆర్ రూరల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెం ట్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామంలోని రాముల ఆలయం కి 10,000 రూపాయల విలువగల వస్తువులను గ్రామస్తులకు అందించారు అలాగే గ్రామానికి చెందిన శేఖర్ రమాదేవి అనే దంపుతుల కుమార్తెకు ల్యాప్ టాప్ కోసమని 10,000 రూపాయలని సాయం చేయడం జరిగింది. అలాగే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు పలకలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్ధన గట్టు గ్రామంలో మేము జన్మించడం చాలా సంతోషంగా ఉందని మా సొంత గ్రామానికి మా వంతు సహకారం అందిస్తున్నామన్నారు. మునుముందు కూడా గ్రామంలోని పిల్లలు ఎంతవరకు చదివితే అంతవరకు మా వంతు సహకారం అందిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు మా గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మేము ముందుకు పోతామని వారన్నారు. గ్రామ ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన పరిష్కారం చేయడానికి ముందుంటామన్నారు . గ్రామానికి సాయం చేయడంతో వారిని గ్రామ పెద్దలు అందరూ కలిసి అభినందించారు అలాగే సంతోషాన్ని వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో డాక్టర్లు బాలచంద్రారెడ్డి అనిత రెడ్డి, హనుమంత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇన్నర్ వీల్ క్లబ్ మాజీ అధ్యక్షురాలు శైలజ రెడ్డి, శారద, సత్యమ్మ,గ్రామ పెద్దలు సూర్యప్రకాశ్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి, భాస్కర్ రెడ్డి కృష్ణారెడ్డి హరిచంద్ర అచ్చయ్య, నీలకంఠ రాజు ఉపాధ్యాయుడు ప్రసాద్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

