ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులుగా అరుణ..
1 min read
కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించిన మహిళా ఉద్యోగులు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ మహిళా ఉద్యోగుల నూతన కమిటీ అధ్యక్షులుగా డిప్యూటీ తహసిల్దార్ కే అరుణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈమె ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దారుగా పని చేస్తున్నారు.మహిళా ఉద్యోగుల జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.నంద్యాలలో శాంతి భవనంలో రాష్ట్ర మహిళా అధ్యక్షులు పారే లక్ష్మి మరియు రాష్ట్ర మహిళా సెక్రెటరీ విజయలక్ష్మి అలాగే నంద్యాల జిల్లా మహిళా సంఘం అధ్యక్షులు డోన్ తహసిల్దార్ నాగమణి అధ్యక్షతన నూతన కమిటీని ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.డివిజన్ వైస్ ప్రెసిడెంట్ గా పాములపాడు ఏపీఓ విమలమ్మ,కో చైర్ పర్సన్ గా వీఆర్వో సుజిత, ఎన్ మల్లేశ్వరి,ఏ మల్లేశ్వరి, రమాదేవి,జనరల్ సెక్రటరీగా నందికొట్కూరు ఏపీఓ అలివేలు మంగమ్మ, కార్యదర్శులుగా నందికొట్కూరు మున్సిపాలిటీ జూనియర్ అసిస్టెంట్ శ్రీలత, ఏపీఓ కవిత,విజయలక్ష్మి, భాగ్యమ్మ,ట్రెజరర్ గా డిప్యూటీ సర్వేయర్ అనూష రాణి లను నూతన డివిజన్ కమిటీగా ఎన్నుకున్నట్లు అరుణ తెలిపారు.మహిళలకు ఉద్యోగ సమస్యలపై ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నూతన కమిటీ దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి కమిటీ తరఫున తమ వంతుగా కృషి చేస్తామని నూతన కమిటీ అధ్యక్షులు తెలిపారు.అదే విధంగా నూతన కమిటీ సభ్యులను శాలువాలు పూలమాలతో ఘనంగా సత్కరించారు.
