ఉపాధి హామీ సమస్యలపై మార్చి 12న చలో అసెంబ్లీ
1 min read
పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి…
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: సుదీర్ఘ ప్రజా పోరాటాల నేపథ్యంలో పోరాడి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఈ నేపథ్యంలో ప్రభుత్వాల వైఖరికి నిరసనగా మార్చి 12వ తేదీ జరుగు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.గురువారం పత్తికొండ పట్టణంలోని శిరిడి సాయిబాబా ప్రాంగణంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ అధ్యక్షతన గ్రామాలలో వలసలు అరికట్టాలి- ఉపాధి హామీ పనులు కల్పించాలని అంశాలపై ఉపాధి కూలీలతో సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యంలో భాగంగా ఏ డేటా పథకంలో బడ్జెట్లో కోత కోస్తున్నారని, కష్టపడి పనిచేసిన కూలీలకు వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదని రకరకాల నిబంధనల పేరుతో పెద్దలకు దాసోహం అంటూ కూలీల కడుపులో కొడుతున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పథకం కోసం లక్ష కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉపాధి పని దినాల పెంపు అడిగిన వారందరికీ పని, పని చేసిన వారికి ప్లే సిప్పులు ఇవ్వాలని కోరారు. పని అడిగితే ప్రజలను మభ్యపెడుతూ,భయపెడు తున్నారని విమర్శించారు.ఉపాధి కూలీలు పొట్టకూటికోసం ఉన్న ఊరిని వదిలి సుదూర ప్రాంతాలకు వలసలు వెళుతూ ప్రమాదాలు జరిగి అనేకమంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఏళ్ల పోరాటంతోనే ఉపాధి హామీ పథకాన్ని సాధించుకున్నామని అన్నారు.
