కర్నూలులో.. జీ తెలుగు తారల సందడి..
1 min read
ప్రేమకు వేళాయెరా ప్రత్యేక కార్యక్రమం ఈ శనివారం సాయంత్రం 5 గంటలకు!
పల్లెవెలుగు ,కర్నూలు : వినోదాత్మక కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు బుల్లితెర అభిమానులకు అరుదైన కానుక అందిస్తోంది. తమ అభిమాన సీరియల్ తారలను ప్రత్యక్షంగా కలిసే అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఆరంభం నుంచే ఆసక్తికరమైన కథ, ఆకట్టుకునే మలుపులతో కొనసాగుతున్న జీ తెలుగు సీరియల్స్ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, జానకిరామయ్యగారి మనవరాలు, ఉమ్మడి కుటుంబం నటీనటులు ఈ నెల 15న(శనివారం) మన కర్నూలులో నిర్వహించనున్న ప్రేమకు వేళాయెరా కార్యక్రమంలో పాల్గొనేందుకు రాబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి మీ అభిమాన యాంకర్ రవి వ్యాఖ్యాతగా వ్యవహరించనుండగా, పలువురు జీ తెలుగు నటీనటులు సందడి చేయనున్నారు. కర్నూలులోని APSP 2వ బెటాలియన్ గ్రౌండ్ (APSP 2nd Battalion Ground)/TG Venkatesh Outdoor Stadium Ground వేదికగా శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రేమకు వేళాయెరా పేరున ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరగనుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు ప్రేక్షకులకు జీ తెలుగు మరో సర్ప్రైజ్ని అందించనుంది. ఇందులో భాగంగా మీ టీవీలో ‘జీ తెలుగు’ ఛానల్ చూస్తూ సెల్ఫీతీసి 7032904615 నెం.కి వాట్సాప్ చేస్తే మీ అభిమాన తారలు కలిసే అవకాశం. ఈ కార్యక్రమంలో భాగంగా జీ తెలుగు తారలు తమ అభిమానులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అభిమానుల కోలాహలంతో సందడిగా సాగనున్న ఈ కార్యక్రమంలో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ నుంచి మిత్ర(రఘు), లక్ష్మీ(గౌతమి), జాను (శ్వేతా), వివేక్ (సిద్ధూ) జానకి రామయ్యగారి మనవరాలు సీరియల్ నుంచి ఉత్తమ్(రాజీవ్), మైథిలి(సంగీత)తో పాటు మేఘసందేశం భూమి(భూమిక), యశ్వంత్-శోభితా శెట్టి, సుస్మిత, కరమ్ కూడా పాల్గొని సందడి చేయనున్నారు. బుల్లితెరపై నటనతో అలరిస్తున్న జీ తెలుగు తారలు తమ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చేస్తున్నారు. మరి మీరూ జీ తెలుగు నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ ప్రేమకు వేళాయెరా కార్యక్రమంలో పాల్గొని మీ అభిమాన తారలను నేరుగా పలకరించే అవకాశం పొందండి.