పకడ్బందీగా ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు…
1 min read
ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి
ఎన్నికల నిర్వహణలో నిస్పక్షపాతంగా వ్యవహరించాలి
ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పల్లెవెలుగు ,ఏలూరు జిల్లా ప్రతినిధి: ఫిబ్రవరి 27న జరిగే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఎన్నిక ప్రక్రియ స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్ట భధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశమందిరంలో రిటర్నింగ్ అధికారి కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి. విశ్వేశ్వరరావుతో కలిసి సమీక్షించారు. ఈనెల 27వ తేదీ పోలింగ్ రోజున అనుసరించాల్సిన విధానం, వెబ్ కాస్టింగ్, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూం కి తరలించడం, రిసెప్షన్ సెంటర్లు, రూట్ అధికారులు, పోలీస్ బంధోబస్తు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, బ్యాలెట్ పేపర్లు, ఎంసిసి,ఎంసిఎంసి, పోస్టల్ బ్యాలెట్లు, వంటి ఏర్పాట్లపై చర్చించారు. ఈనెల 27వ తేదీన పోలింగ్ కు ముందు నిర్వర్తించాల్సిన విధి విధానాలను, 27వతేదీ పోలింగ్ ప్రారంభం నుంచి చివరివరకు ఎటువంటి తప్పులకు తావులేకుండా స్వేచ్ఛాయుత వాతావరణం ఎన్నిక జరిగేందుకు కృషిచేయాలన్నారు. ఆరు జిల్లాల పరిధిలో జరిగే ఈ పట్టభధ్రుల ఎన్నికల్లో మొత్తం 35 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారన్నారు. ఏలూరు జిల్లాలో 87 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ సిబ్బందికి నిర్ధేశించిన ప్రాంతంలో ఈనెల 26వ తేదీ ఉదయం నుంచి పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుందన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభధ్రులకు సంబంధించి నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ చేపట్టాలన్నారు. పివో, ఏపివోలకు 2వ విడత శిక్షణా కార్యక్రమాన్ని ఈనెల 22వ తేదీన నిర్వహించాలన్నారు. మార్చి 3వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ఏర్పాటుపై కూడా సమీక్షించారు. సమావేశంలో జెడ్పి సిఇఓ కె.సుబ్బారావు, డిఆర్డిఏ పిడిడా:ఆర్.విజయరాజు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యం. ముక్కంటి, డ్వామా పిడి వెంకట సుబ్బారావు, జిల్లా పౌర సరఫరాల సంస్ధ మేనేజరు వి. శ్రీలక్ష్మి, డిఇఓ వెంకటలక్ష్మమ్మ, ఎల్టిఎం డి. నీలాధ్రి, డిసివో శ్రీనివాస్, జిల్లా ఖజానా అధికారి టి. కృష్ణ, ఉద్యాన శాఖ డిడి రామ్మోహన్, ఆర్ అండ్ బి ఎస్ఇ జాన్ మోషే, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్.ఎస్. కృపావరం, జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ భాషా, తదితరులు పాల్గొన్నారు.
