మహానంది లో శ్రీనిధి ఎం డి పూజలు
1 min read
పల్లెవెలుగు ,మహానంది: మహానంది పుణ్యక్షేత్రంలో రాష్ట్ర శ్రీనిధి ఎం డి హరి ప్రసాద్ పూజలు నిర్వహించారు. శుక్రవారం స్వామివారి దర్శనానికి వచ్చిన ఆయన కు టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీకామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామివార్ల కు అభిషేకార్చనలు నిర్వహించారు. ఆలయ ఆనవాయితీ ప్రకారం కళ్యాణ మండపంలో వేదపండితులు నాగేశ్వర శర్మ వేదమంత్రోత్సరణ మధ్య కండువా కప్పి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.ఆయన వెంట ఏ జి ఎం లు ఉమామహేశ్వర రావు, నాగ ప్రసాద్, తదితరులు ఉన్నారు.