ప్రతి విద్యార్థి జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
1 min read
పల్లెవెలుగు, పత్తికొండ: సామాజిక జీవన మనుగడకు, ప్రగతికి సోపానాలైన జీవన నైపుణ్యాలను ప్రతి విద్యార్థి పెంపొందించుకోవాలని సైకాలజీ టీచర్లు స్వప్న, టంగుటూరి స్వప్న కుమారి, సూపర్వైజర్ నశ్రీన్, తేజుమయి విద్యార్థినిలకు బోధించారు. శుక్రవారం పత్తికొండ స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ ఆధ్వర్యంలో “ప్రగతి ప్రాజెక్టు”లో భాగంగా విద్యార్థినిలకు సైకాలజీ తరగతులను నిర్వహించారు. టీచర్లు పాఠశాల విద్యార్థినిలకు జీవన నైపుణ్యాల గురించి బోధించారు. ప్రగతి ప్రాజెక్టు సైకాలజీ టీచర్లు నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు ఎలా పెంపొందించుకోవాలో విద్యార్థినిలకు బోధించారు. సమస్యలు ఉత్పన్నమైనప్పుడు లేదా భవిష్యత్తును మలుచుకునే సమయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలో సమూహ మరియు వ్యక్తిగత నిర్ణయం తీసుకునే పద్ధతులను తెలియజేశారు. .అదేవిధంగా విమర్శనాత్మక ఆలోచన అనేది కూడా వ్యక్తి మనుగడకు పురోగతికి చాలా అవసరమని వారు తెలిపారు. ఇది ఒక వ్యక్తి యొక్క జ్ఞాన స్థావరంపై ఆధారపడి ఉంటుందని వారు వివరించారు.వీరు పిల్లలకు ఒక ప్రశ్నావళి పత్రం ఇచ్చి దానిని పూరించమని విద్యార్థినిలకు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.