ఘనంగా 17వ వార్డులో వైసీపీ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం
1 min read
పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలోని 17వ వార్డులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు కామార్తి నాగేశప్ప ఆధ్వర్యంలో 17వ వార్డు కౌన్సిలర్ సంధ్యారాణి అధ్యక్షతన జరిగింది.కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కామార్తి నాగేశప్ప,చేనేత జిల్లా అధ్యక్షులు ఎం.కె. శివ ప్రసాద్ , 17వ వార్డు కౌన్సిలర్ సంధ్యారాణి మాట్లాడుతూ 17వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్యకర్తల సూచనలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పార్టీ ఆదేశాల మేరకు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి, బుట్టా రేణుక విజయాన్ని సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పట్టణ అధ్యక్షులు కామార్తి నాగేశప్ప కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జి. సత్యనారాయణ, మెకానిక్ బీరప్ప,బి. సత్యనారాయణ, బి.పకీరప్ప,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.