NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ‌ర్డ్ ఫ్లూపై ప్రజ‌లు ఆందోళ‌న చెంద‌వ‌ద్దు.. రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

1 min read

బ‌ర్డ్ ఫ్లూ వ్యాధి నియంత్రణకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నాం… మంత్రి టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు, కర్నూలు: బ‌ర్డ్ ఫ్లూ వ్యాధిపై ప్రజ‌లు ఆందోళ‌న చెందొద్దని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. క‌ర్నూల్లో బ‌ర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపించిన‌ విష‌యం తెలిసిన వెంట‌నే మంత్రి టి.జి భ‌ర‌త్ జిల్లా క‌లెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుత ప‌రిస్థితిపై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాధిని నివారించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై ఆరా తీశారు. బ‌ర్డ్ ఫ్లూతో చ‌నిపోయిన వాటిని స‌క్రమంగా పూడ్చిపెట్టాల‌న్నారు. వ్యాధి వ్యాప్తి చెంద‌కుండా ప్రభుత్వం జారీ చేసిన మార్గద‌ర్శకాల‌ను త‌ప్పకుండా పాటించాల‌ని మంత్రి చెప్పారు. ప్రజ‌ల‌ను ఎప్పటిక‌ప్పుడు అప్రమ‌త్తం చేయాల‌ని చెప్పారు. ఇక ప్రజ‌లు సైతం బ‌ర్డ్ ఫ్లూ పై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. త‌గిన జాగ్రత్తలు పాటించాల‌ని ఆయ‌న ప్రజలకు సూచించారు.

About Author