ఆర్యులో.. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం
1 min read
పల్లెవెలుగు, కర్నూలు: ప్రతినెల మూడవ శనివారం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలన్న రాష్ట్రప్రభుత్వ ఉత్తర్వులమేరకు రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఈరోజు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం వారి ఆధ్వర్యంలో ప్రాంగణంలోని ఇంజినీరిగ్ కళాశాలవద్ద ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పరిశుభ్రతా కార్యక్రమాలను చేపట్టారు. వర్సిటీ ప్రాంగణంతోపాటు హాస్టళ్ల పరిసరాలను పరిశుభ్రంగా చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో సహకరిస్తుందని ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. నాగరాజు తెలిపారు. వర్సిటీ వైస్ ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ బి. విజయుడు, డాక్టర్ నాగచంద్రుడు, శివప్రసాదరెడ్డితోపాటు విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, వివిధ విభాగాల అధ్యాపకులు, ఆచార్యులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.